జయలలితకు చికిత్స చేసిన వైద్యులకు సమన్లు

Updated By ManamSat, 08/18/2018 - 14:37
Jayalalithaa

Jayalalithaaచెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చివరి రోజుల్లో చికిత్స అందించిన ముగ్గురు వైద్యులకు జస్టిస్ అరుముగస్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ ముగ్గురు ఆగష్టు 23, 24 తేదీల్లో కమిషన్ ఎదుట హాజరవ్వాలని సమన్లలో తెలిపారు. అందులో పల్మొనాలజీ విభాగానికి చెందిన బీసీ ఖిలానీ, అనస్తియాలజీ ప్రొఫెసర్ అంజన్ త్రిఖా, కార్డియాలజీకి చెందిన ప్రొఫెసర్ నితీశ్ నాయక్‌లు ఉన్నారు.

అయితే అనారోగ్యంతో 2016 సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన జయలలిత చికిత్స తీసుకుంటూ డిసెంబర్ 5న కన్నుమూశారు. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చికిత్స సమయంలో అమ్మను చూసేందుకు ఎవ్వరినీ అనుమతించకపోవడంతో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అమ్మ మృతిపై విచారణ జరిపేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

English Title
Summons to Doctors who gave treatment to Jayalalithaa
Related News