సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ స్పందన

Updated By ManamWed, 03/14/2018 - 14:47
sunder pichai and satya nadella response on stephen hawking death

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచం ఓ అందమైన మేధస్సును, విజ్ఞానిని కోల్పోయిందని ట్వీట్ చేసిన ఆయన.. హాకింగ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఇక, ఇటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా ఆయన మరణంపై విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు మనం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ప్రజలకు సంక్లిష్ట సిద్ధాంతాలు, విశేషాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ శాస్త్రరంగానికి ఆయన చేసిన సేవలను యావత్ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. ఎదురైన అన్ని ఆటంకాలను దాటుకుంటూ ఖగోళం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేసేందుకు ఆయన చూపిన తెగువ, స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిది. ఆయన అందరినీ వదిలేసి వెళ్లిపోయినా.. ఆయన అందించిన వారసత్వం, విజ్ఞానం ఎప్పటికీ జీవించే ఉంటుంది’’ అని ఇటు ట్విట్టర్‌లో, అటు లింక్‌డ్‌ఇన్‌లో కొనియాడారు. 

English Title
sunder pichai and satya nadella response on stephen hawking death
Related News