సబ్జా... సూపర్ ఫుడ్!

Updated By ManamThu, 03/01/2018 - 22:56
sabja juice

ఔషధ గుణాలు మెండుగా ఉన్న సబ్జా గింజలపై చాలామందికి చిన్న చూపు ఉంది. వేసవిలో సబ్జా గింజలను రోజూ తీసుకోవడం అలవాటుగా పెట్టుకుంటే చాలా మంచిది 

ఎలా తినాలి?
basilమార్కెట్లో లభించే సబ్జా గింజల్లో ఇసుక, రాళ్లు లేకుండా శుభ్రం చేసుకోండి.  వీటిని కాసిన్ని నీళ్లు పోసి నానబెట్టండి. 10 నిమిషాలకంతా మీకు ఉబ్బిన సబ్జాలు కనిపిస్తాయి. ఇందులో మరింత నీరు పోసి పూర్తిగా నాననివ్వాలి.  ఆతరువాత మీకు నచ్చిన వెరైటీలను ట్రై చేసేందుకు ఓ రెండు నిమిషాల సమయం వెచ్చిస్తే చాలు బోలెడు సబ్జా వెరైటీలు సిద్ధమవుతాయి. వేసవిలో అయితే చల్లని పాలు లేదా మజ్జిగ కలుపుకుని తాగితే చాలు. కమ్మని రుచినచ్చే సబ్జా గింజలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే.. గోరువెచ్చని నీటిలో నానబెట్టిన సబ్జా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు విడుదలై.. జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. 

ఏముంటుంది?
సబ్జా గింజలు చూసేందుకు చాలా చిన్నగా కనిపిస్తాయి..basil నానితే కాస్త సగ్గుబియ్యంలా అగుపిస్తాయి. అయితే వీటిలో ఉన్న ఔషధ గుణాలు అన్ని వయసుల వారిపై మంచి  ప్రభావం చూపుతాయి. బ్లడ్ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని పారద్రోలుతుంది. చల్లదనాన్ని ఇచ్చి.. మీ  ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. యాంటీ ఏజింగ్‌గా పనిచేసే సౌందర్య సాధనం కూడా. స్కిన్ ఇన్ఫెక్షన్స్‌కు మంచి మందుగా సబ్జా గింజలు పనిచేస్తాయి.  జుట్టు రాలడం తగ్గి, వాటి పెరగడంలో సహకరించే సబ్జా విత్తనాలకు మీ మెనూలో సరైన ప్రయారిటీ ఇవ్వడం ఇప్పటినుంచైనా మొదలు పెట్టండి. 
 

హెల్తీ డ్రింక్...
సేమ్యా, ఐస్ క్రీం, పళ్లు, జ్యూస్, పెరుగు, మజ్జిగ, పాలు ఇలా దేంతోనైనా సులువుగా కలిసిపోయే సబ్జా గింజలు వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే బెస్ట్ బాడీ కూలెంట్స్. మిల్క్ షేక్స్, నిమ్మ రసం, షర్బత్ ఇలా వేటిలోనైనా నానబెట్టిన sbja drinkసబ్జా గింజలను కలిపి తాగవచ్చు. బాడీ డీటాక్స్ కావాలంటే షార్ట్ కట్‌గా సబ్జా నీరు తాగితే సరిపోతుంది. ఎసిడిటీ వంటి సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. విటమిన్ కే, ఐరన్ పుష్కలంగా ఉన్న సబ్జా నవయవ్వనం నింపేలా సహకరిస్తుంది. తరచూ వచ్చే సీజనల్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ పై చక్కగా పనిచేసే సబ్జాను మీరు మీ కిచెన్‌లో ఎప్పుడూ స్టాక్ పెట్టుకోండి. థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, తేనె, పాలు, నీళ్లు, చక్కెరతో కూడిన పలు కాంబినేషన్లతో తయారు చేసే వెరైటీలు తప్పకుండా సేవిస్తారు.  కానీ చిన్న పిల్లలకు మాత్రం ఇవి గొంతులో చిక్కుకునే ప్రమాదం ఉంది కనుక సబ్జా గింజల వెరైటీలను చిన్నారులకు ఇవ్వకపోతే మంచిది. ఇక గర్భిణీ స్త్రీలలో కూడా సబ్జా ఈస్ట్రోజెన్ స్థాయిని తగ్గించేలా ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక వీటిని గర్భిణీలు సేవించకపోతే మంచిది.  తక్కిన వారంతా సబ్జాల వెరైటీలను ఈ వేసవిలో హాయిగా ఎంజాయ్ చేయవచ్చు.

పొట్ట చుట్టూ  ఉండే కొవ్వు సహజంగా కరిగేందుకు ఇది చక్కగా పనిచేస్తుంది. రోజు కనీసం ఓ చిన్న గ్లాసైనా సబ్జా నీరు, లేదా సబ్జాతో చేసిన ఆహార పదార్థాలు సేవించండి, ఇది రుచికరంగానూ ఉంటుంది. ఒబేసిటీతో బాధపడేవారు తప్పనిసరిగా సబ్జా గింజలు తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యధికంగా ఉన్న ఈ గింజల్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు బాగా నిండినట్టు అనిపిస్తూ, ఏదేదో జంక్ ఫుడ్ లాగించాలనే ఆలోచనలకు కళ్లెం వేస్తుంది. కనుక ఆకలి అదుపులో ఉండేలా ఇవి పనిచేస్తాయి. ఎప్పుడూ ఆకలితో అలమటించేవారు ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్ లో కూడా నానబెట్టిన సబ్జాలను ఉపయోగిస్తే ఆకలిని కొంతవరకూ జయించే చాన్స్ ఉంటుంది.

English Title
super diet
Related News