అత్తా అల్లుళ్లు సూపర్ హిట్

Updated By ManamWed, 03/14/2018 - 23:05
image

లఖ్‌నవ్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఏడాదిలోపే జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరైమెన ఎదురుదెబ్బతింది. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి గతంలో ప్రాతినిధ్యం వహించిన రెండు లోక్‌సభ నియోజకవర్గాలను ఆ పార్టీ కోల్పోయింది. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్‌లలో జరిగిన ఉప ఎన్నికలలో సమాజ్‌వాదీ - బహుజన సమాజ్ పార్టీ కూటమి జయకేతనం ఎగరేసింది. వరుసగా ఐదుసార్లు గోరఖ్‌పూర్ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా గెలిచారు. ఆయన సీఎం కావడంతో ఖాళీ అయిన స్థానాన్ని ఎస్పీ-బీఎస్పీ కూటమి ఎగరేసుకుపోయింది. 
 

image

ఫలించిన వ్యూహం
సమాజ్‌వాదీతో చేతులు కలపాలని చిట్టచివరి నిమిషంలో ‘బెహన్ జీ’ మాయావతి తీసుకున్న నిర్ణయం ఫ లించింది. ‘అత్త-అల్లుడు’ కాంబినేషన్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తమ పార్టీ అతి విశ్వాసం, అఖిలేశ్-మాయ కూటమి సామర్థ్యాన్ని తక్కువ అంచనావేయడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంగీకరించారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ, కాంగ్రెస్ వేర్వేరుగా ఉన్నాయని, కానీ ఎన్నికల మధ్య లో పొత్తుపెట్టుకోవాలని నిర్ణయించాయని.. వాళ్లను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని ఆయన అ న్నారు. అతివిశ్వాసం కూడా కొంత కారణైమెందన్నారు. ఎస్పీ-బీఎస్పీల మధ్య రాజకీయ వ్యాపారాన్ని ఎదుర్కోడానికి భవిష్యత్తులో తగిన వ్యూహం రచిస్తామన్నారు.
 

రెండుచోట్లా వాళ్లే..
ఫూల్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి కశ్లేంద్రసింగ్ పటేల్‌ను సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నాగేంద్ర సింగ్ పటేల్ 59 ఓట్లకు పైగా తేడాతో మట్టికరిపించారు. గోరఖ్‌పూర్‌లో కూడా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రవీణ్ నిషాద్... బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై 26 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు కడపటి వార్తలందేసరికి తెలిసింది. సమాజ్‌వాదీ పార్టీ- బహుజన సమాజ్ పార్టీ కూటమి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్నారు. ఇది అత్తా అల్లుళ్ల విజయుమని వారు సంబరపడుతున్నారు. అఖిలేశ్ యాదవ్ తన మేనల్లుడి లాంటివాడని గతంలో మాయావతి చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల కూటమి విజయం సాధించిందని అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రధానంగా ఇన్నాళ్లూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ స్థానాన్ని తాము కైవసం చేసుకోవడంతో వారి ఆనందం మరింత పెరిగింది. ఇంకా ఫలితాలు రాకముందే.. అంటే మధ్యాహ్నం నుంచే కార్యకర్తలు రంగులు చల్లుకుంటా.. ‘భువా-భతీజా’ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. 
 

బిహార్‌లో ఇలా....
బిహార్ ఉప ఎన్నికల్లో ఓ లోక్‌సభ స్థానాన్ని, ఓ అసెంబ్లీ సీటును ఆర్జేడీ కైవసం చేసుకోగా, మరో అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తిరిగి సొంతం చేసుకుంది. అరారియా లోక్‌సభ స్థానంలో బీజేపీ ప్రత్యర్థి ప్రదీప్‌కుమార్ సింగ్‌పై 61 వేలకు పైగా ఆధిక్యంతో ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలం విజయం సాధించారు. ఆర్జేడీ ఎంపీ మహమ్మద్ తస్లిముద్దీన్ మృతి కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. తస్లిముద్దీన్ తనయుడు అలాంను ఆర్జేడీ బరిలోకి దింపింది. అలాగే జహానాబాద్ అసెంబ్లీ స్థానం కూడా ఆర్జేడీ ఖాతాలోకి పడింది. ఆర్జేడీ అభ్యర్థి కృ ష్ణమోహన్ యాదవ్ జేడీయూకు చెందిన అభిరామ్ శర్మపై 35,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉప ఎన్నికల్లో ఓ అసెంబ్లీ స్థానాన్ని నెగ్గిన బీజేపీకి కొద్దిపాటి ఊరట లభించింది. భబువా అసెంబ్లీ నియోజకవర్గాన్ని మళ్లీ బీజేపీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి శంభు పటేల్‌పై 11 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ నాయకురాలు రింకీ రాణి పాండే గెలిచారు.

English Title
super hit in two places
Related News