సూపర్ కింగ్స్ సమరోత్సాహం..

Updated By ManamThu, 05/10/2018 - 23:57
ipl
  • చావోరేవో తెల్చుకోనున్న రాజస్తాన్ రాయల్స్ 

iplఒకప్పటి ఐపీఎల్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ బరిలో నిలవటం కోసం తంటాలు పడుతోంది.  టాప్‌గేర్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ చావో రేవో తేల్చుకోనుంది. రాయల్స్‌కు ఈ మ్యాచ్ గెలుపు తప్పనిసరికాగా.. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది చెన్నై...
జైపూర్: ఐపీఎల్ ఆరంభ టైటిల్‌ను గెలచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్లీ ఇంత వరకు ఆలాంటి ప్రతిభ కనబరచలేదు. ఈసారి కూడా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శుక్రవారం పటిష్టవైున చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ అమీ తుమీ తేల్చుకోనుంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గిపోయాయి. ఇక్కడ చివరిసారి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌పై రాజస్థాన్ 15 పరుగులతో గెలిచింది. అయితే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆడాలి. అంతేకాదు మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లోనే సత్తా చాటాలి. ఇంతకుముందు పుణెలో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగులతో గెలిచిన చెన్నై జట్టుపై ప్రతీకారం తీర్చుకునేం దుకు కూడా శుక్రవారం రాజస్థాన్ జట్టు బరిలోకి దిగనుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ ఆడిన తీరు చెప్పుకోదగినంతగా లేదు.   10 మ్యాచ్‌లకుగాను ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలకు దగ్గరగా ఉన్న అజింక్య రహానే సేన ఈ మ్యాచ్‌ను తప్పక గెలవాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోతే రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయినట్టే. రాజస్థాన్ జట్టు ఇప్పుడు హోం గ్రౌండ్‌కు వచ్చేసింది.   జైపూర్‌లో నాలుగు మ్యాచ్‌లకు గాను మూడింటిలో రాజస్థాన్ గెలిచింది. దీంతో శుక్రవారంనాటి మ్యాచ్ కూడా రాజస్థాన్ జట్టుకు కీలకంగా మారింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు పేలవ ప్రదర్శనను కనబరిచారు. కెప్టెన్ రహానే, సంజు శాంసన్ యావరేజ్ ప్రతిభ, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్ప్, రాహుల్ త్రిపాఠి ఆశించిన మేరకు ఆడక పోవడంతో రాజస్థాన్ ఈ స్థితికి దిగజా రింది. అయితే బలమైన సీఎస్‌కేపై గెలవాలంటే బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ కలిసి కట్టుగా రాణించాలి. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ జట్టుకు అండగా నిలిచి 58 బంతుల్లో 82 పరుగులు చేయడంతో రాజస్థాన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. అయితే ఈ స్కోరును బౌలర్లు సంరక్షించారు. కృష్ణప్ప గౌతమ్, కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి, జోఫ్రా ఆర్చర్‌లు అద్భుత ప్రతిభ కనబరిచారు. మరోవైపు ఆడిన 10 మ్యాచ్‌లకు గాను 14 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు చాలు. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో ఆసాధారణ ఫామ్‌ను కనబరుస్తోంది. చెన్నై బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కానీ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో బౌలర్లు రాణించి నప్పటికీ బౌలింగ్ ఆ జట్టును కలవరపెడు తోంది. అయితే చహర్ గాయంపాలై ఈ మ్యాచ్‌కు దూరమైన నేప థ్యంలో పేస్ త్రయం లుంగి ఎంగిడి, డేవిడ్ విల్లే, శార్దూల్ మరింత బాధ్యతా యుతంగా బౌలింగ్ చేయాలి. చెన్నై బ్యాట్స్‌మెన్ అందరూ ఫామ్‌లో ఉన్నారు. జట్టుకు అవసరం ఉన్నపుడల్లా అంబటి రాయుడు, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్, వెస్టిండీస్ డ్వైన్ బ్రావో, కెప్టెన్ ధోనీ, రైనా  తమ చేయూతను అందిస్తూనే ఉన్నారు.

ఐపీఎల్‌లో నేడు
రాజస్థాన్ రాయల్స్ X చెన్నై సూపర్ కింగ్స్ సవాయ్‌మాన్‌సింగ్ స్టేడియం-జైపూర్ రాత్రి 8 గంటలకు.. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Tags
English Title
Super King's paranoia
Related News