విజయవాడలో మహేశ్ సందడి..

Updated By ManamFri, 04/27/2018 - 12:02
Super Star, Mahesh Babu, Vijayawada visits Durga temple

Super Star Mahesh babu arrives Vijayawadaవిజయవాడ: ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విజయవాడలో సందడి చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ చేరుకున్న ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా వచ్చారు. గన్నవరం ఎయిర్‌ఫోర్టుకు చేరుకున్న మహేశ్.. అక్కడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి కొరటాల శివతో కలిసి బయల్దేరి వెళ్లారు. అన్నపూర్ణ, ట్రెండ్‌సెట్‌ మాల్‌లో నిర్వహించే విజయోత్సవ వేడుకల్లో వీరిద్దరూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ తన అభిమానులతో ‘భరత్‌ అనే నేను’ చిత్రం వీక్షించనున్నట్టు సినీవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఆ తరువాత మహేశ్, ఎంపీ గల్లా జయదేవ్, కొరటాల శివ ముగ్గురూ కలిసి తిరుపతికి బయల్దేరనున్నారు. హీరో మహేశ్‌, అందాల తార కియారా అడ్వాణీ నటించిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఇటీవల విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. 
maheshe

మరిన్ని ఫొటోల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

English Title
Super Star Mahesh babu arrives Vijayawada
Related News