వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Updated By ManamMon, 08/27/2018 - 12:00
whatsapp
supreme court

న్యూఢిల్లీ: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా భారత్‌లో ఫిర్యాదుల సేకరణ కోసం ఓ ప్రత్యేక అధికారిని నియమించకపోడంపై వాట్సాప్ సంస్థకు న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా వాట్సాప్ మెసేజింగ్ సేవల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తమవుతుండటంతో ఆ సంస్థకు ఇప్పటికే  కేంద్ర ఐటీ శాఖ రెండుసార్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఇటీవల వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్ భారత్ పర్యటన సందర్భంగా కేంద్ర ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఫేక్ న్యూస్ నియంత్రణ బాధ్యతను వాట్సాప్‌పై పెట్టడంతో పాటు, ఈ సమస్యకు పరిష్కరం చూపాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం తరపున మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారు.

supreme court

అలాగే వాట్సాప్‌కు భారత్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, అంతేకాకుండా ఫిర్యాదుల స్వీకరణకు ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించాలని ఆయన ఈ సందర్భంగా వాట్సాప్ సీఈవోకు సూచించారు.  అయితే దీనిపై ఇప్పటివరకూ వాట్సాప్ సంస్థ స్పందించకపోవడంతో కేంద్రం ..ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

English Title
Supreme Court issued a notice to WhatsApp
Related News