హైకోర్టు, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు

Updated By ManamFri, 08/31/2018 - 13:44
supreme court
supreme court

న్యూఢిల్లీ : హైకోర్టు విభజనపై శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా అభిప్రాయం తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలపాటు  వాయిదా పడింది.

ప్రస్తుత హైకోర్టు భవనాన్ని రెండుగా విభజించాలని ... తెలంగాణ న్యాయవాదులు ఈ సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు. హైకోర్టులో 24 హాళ్లు ఖాళీగా ఉన్నాయని, ఒకవేళ ఏపీ ప్రభుత్వం వాడుకోవాలంటే ఖాళీగా ఉన్న ఆ హాళ్లను వాడుకోవాలని, లేకుంటే తామే ఖాళీ చేసి వెళతామని న్యాయవాదులు స్పష్టం చేశారు. 

English Title
Supreme Court Issues Notice To High court, Andhra pradesh government
Related News