ప్రియకే సుప్రీం మద్దతు

Updated By ManamWed, 02/21/2018 - 12:07
Priya Prakash

Priya Prakash మలయాళ బ్యూటీ ప్రియ ప్రకాశ్‌పైనా, 'ఒరు ఆధార్ లవ్' దర్శకుడు ఒమర్ లులూపైనా ఎక్కడా కేసులు పెట్టొందని, వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. తెలంగాణ, మహారాష్ట్రలో ప్రియపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంను ఆశ్రయించగా.. దాన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

అయితే 'ఒరు ఆధార్ లవ్‌'లోని 'మాణిక్య మలరాయ పూవి' అనే పాటలో ముస్లింలను కించపరిచే పదాలు ఉన్నాయని.. వాటికి ప్రియా ప్రకాశ్ ఇచ్చిన హావభావాలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలంగాణలో, మహారాష్ట్రలో కేసులు నమోదు అయ్యాయి. వాటిని సవాల్ చేస్తూ ప్రియ సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

English Title
Supreme Court supports Priya Prakash 
Related News