'వణక్కమ్ చెన్నై', 'విజిల్ పొడు'

Updated By ManamFri, 01/05/2018 - 09:57
CSK

CSKరెండేళ్ల నిషేధం తరువాత ఈ సంవత్సరం ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ నేపథ్యంలో దిగ్గజ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను రీటెయిన్‌ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ సందర్భంగా సురేశ్ రైనా, రవీంద్ర జడేజా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'వణక్కమ్ చెన్నై', 'విజిల్ పొడు' అంటూ తమ ఆనందాన్ని తెలుపుతూ వీడియో సందేశాన్ని ఇచ్చారు.

అందులో "వణక్కమ్ చెన్నై. చెన్నై సూపర్ కింగ్స్ రీ ఎంట్రీ సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా కోల్పోయిన ఆటను మీ ముందు ఆటడానికి ఉవ్విళ్లూరుతున్నాను. చెపాక్ స్టేడియంలో మిమ్మిల్ని కలవడానికి ఉత్సాహంగా ఉన్నాను" అంటూ సురేశ్ రైనా తెలపగా.. "నేను సీఎస్‌కేలో మళ్లీ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మా ఆటను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మ్యాచ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. విజిల్ పొడు" అంటూ జడేజా సందేశాన్ని ఇచ్చారు. అయితే ధోని నాయకత్వంలో సీఎస్‌కే రెండు సార్లు ఐపీఎల్‌ చాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 
 

English Title
Suresh Raina, Ravindra Jadeja message to Chennai Super Kings fans
Related News