సుష్మా స్వరాజ్‌పై భర్త భావోద్వేగపు ట్వీట్

Updated By ManamMon, 07/02/2018 - 09:27
sushma

Sushma Swarajన్యూఢిల్లీ: మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యేలా చేసిన కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌పై కొంతమంది ప్రశంసలు కురిపించగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌ అండగా నిలిచారు. సుష్మా చేసిన పనికి మెచ్చుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్ చేయడంతో కౌశల్, ఆయనకు భావోద్వేగంతో ఓ ట్వీట్‌ను చేశారు.

‘‘మీ మాటలు నన్ను బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో మరణించారు. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ నా తల్లికి స్వయంగా సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్‌ బదులిచ్చారు. 

English Title
Sushma Swaraj husband emotional tweet on her
Related News