బీజేపీలో కొనసాగుతున్న సస్పెన్స్

Updated By ManamSun, 09/09/2018 - 12:49
Suspense Continues on Telangana bjp condidate list
  • ఎంఐఎం, బీజేపీతో పొత్తులో టీఆర్ఎస్!

  • బీజేపీ, ఎంఐఎం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని గులాం అధినేత!

Suspense Continues on Telangana bjp codidate list

హైదరాబాద్ : అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ముందు కొస్తుంటే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్ని కల్లో అభ్యర్థులను ప్రకటించడంలో కొన్ని రోజలు వేచిచూడనున్నట్టు తెలుస్తోంది. అధికారం తమకే వస్తుందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఇంకా తమ అభ్యర్థుల విషయంలో 15వ తేదీ వరకు వేచి చూస్తామనడంతో పార్టీ వర్గాల్లో కొత్త టెంక్షన్ మొదలైంది. ఎవరికి టికెట్ దక్కుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కా వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించడం లో కొన్నిరోజులు వేచి చూస్తుండటం చూస్తుంటే ఇప్పటికే దేశం అంతటా విస్తరిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ తమ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై భారీ బహిరంగ సభలో పేర్కొననున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ జెండాను తెలంగాణ లో ఎగురవేసేందుకు ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి టీజేఎస్ పార్టీతో చర్చలు జరిపారు.

బీజేపీ, ఎంఐఎం బలంగా ఉన్న స్థానాల్లో టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించక పోవడం చూస్తుంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందేమో అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నిలబెట్టినా పార్టీలో బలం ఉన్న అభ్యర్థులను కాకుండా కొత్త వారిని నిలబెట్టడంతో గెలిచినా, ఓడినా లాభమేనని వ్యూహం పన్నుతున్నట్టు పలువురు రాజకీయ వేత్తలు పేర్కొన్నారు. 

ఎంఐఎం తమ మిత్ర పక్షమే అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొనడం చూస్తుంటే ఎంఐఎం, బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తమ అభ్యర్థులపై జాబితాను అమిత్ షా సభ తర్వాత ప్రకటించడం చూస్తుంటే పక్కా వ్యూహంతో బీజేపీ వస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. 15వ తేదీలోపు సభ ఏర్పాటు చేసి అభ్యర్థులను కూడా అదే సభలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని పార్టీలు బీసీలకు పెద్ద పీఠ వేయ కుండా తక్కువ శాతం ఉన్న కులాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో బీసీలపై బీజేపీ దృష్టి సారించను న్నట్టు సమాచారం. 

తెలంగాణలో 50శాతానికిపైగా ఉన్న ఉన్న బీసీలపై ప్రాధాన్యం ఇస్తే పార్టీకి ఓట్లు రా లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 119స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ పొత్తుపెట్టుకుంటే అధికారం లోకి వచ్చే అవకాశం ఉండటంతో బీజేపీ పలు వ్యూ హాలను రచిస్తోంది. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు టికెట్టు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తమ నియోజక వర్గంలో బలంగా ఉన్న అభ్యర్థులు పార్టీ టికెట్ దక్కని వారిని కూడా బీజేపీ కండువ కప్పనున్నట్టు సమాచారం. ఇప్పటికే తమతో కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారని తాజా మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెబుతుండటంతో బీజేపీ పార్టీపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

English Title
Suspense Continues on Telangana bjp condidate list
Related News