తెలుగులో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా

Updated By ManamMon, 09/24/2018 - 14:11
Swara Bhaskar

Swara Bhaskarమంచి అవకాశం వస్తే తెలుగులో నటిస్తానని అంటోంది బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్. ‘గుజారిష్’, ‘తను వెడ్స్ మను’, ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’, ‘వీర్ దె వెడ్డింగ్’ వంటి పలు హిట్ చిత్రాలలో నటించిన స్వర భాస్కర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటోంది. తన తండ్రి తెలుగు వారేనని. ఆయన వైజాగ్‌కు చెందినవారని, వేసవి సెలవులకు ఇక్కడికి వచ్చినప్పుడు శివ, చంటి తదితర తెలుగు సినిమాలు చూశానని స్వరా తెలిపింది. 

బాహుబలి మొదటి భాగాన్ని తొమ్మిది సార్లు, రెండో భాగాన్ని ఎనిమిది సార్లు చూశానని.. ఆ సినిమా చూసినప్పుడే ప్రభాస్‌కు పడిపోయానని చెప్పింది. మంచి స్క్రిప్ట్‌తో వచ్చి తనకు ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తానని.. కనీసం ఈ రకంగానైనా తన తండ్రిని, తన తరఫు కుటుంబీకుల్ని సంతోషపరచగలనని పేర్కొంది.

English Title
Swara Bhaskar is waiting for telugu scripts
Related News