‘సైరా’ చరిత్రలో నిలిచిపోతుంది!

Updated By ManamWed, 08/22/2018 - 19:01
Sye Raa Movie Creates History Said T Subbarami Reddy

Sye Raa Movie Creates History Said T Subbarami Reddy

నేడు అనగా ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు కొందరు అభిమానులు సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. చిరుకు కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ ఇండస్ట్రీకి బాగా కావాల్సిన వ్యక్తి టి. సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీఎస్సార్‌ను బుధవారం మధ్యాహ్నం చిరు పరామర్శించారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన చిరుకు టీఎస్సార్ పుష్పగుచ్చమిచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. సుమారు అరగంట ఇద్దరూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా సుబ్బరామిరెడ్డి మోకాలికి ఇటీవల విదేశాల్లో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చిరు.. ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు.

Sye Raa Movie Creates History Said T Subbarami Reddy

ఈ సందర్భంగా.. ‘సైరా’ సినిమా గురించి మాట్లాడిన టీఎస్సార్.. ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సినిమా తప్పకుండా ఘన విజయం సాధించి.. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. చిరుతో పాటు చిత్ర సమర్పకురాలు సురేఖ, చిత్ర నిర్మాత రాంచరణ్‌, దర్శకుడు సురేందర్ రెడ్డికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.

English Title
Sye Raa Movie Creates History Said T Subbarami Reddy
Related News