'రంగస్థలం’ విలేజ్ సెట్‌లో ‘సైరా నరసింహారెడ్డి’

Updated By ManamMon, 04/16/2018 - 16:19
syeraa

syeraaమెగాస్టార్ చిరంజీవి, లేడీ సూప‌ర్ స్టార్ నయనతార జంట‌గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ఇత‌ర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా రూపొందించిన కోయిలకుంట్ల ట్రెజ‌రీ సెట్‌లో షూటింగ్‌ను జ‌రుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ‘రంగస్థలం’ మూవీ కోసం వేసిన విలేజ్‌ సెట్ స్థలంలోనే.. ‘సైరా’ కోసం మరో భారీ సెట్‌ను వేయనున్నార‌ని తెలిసింది. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణానికి సంబంధించిన‌ పనులు చకచకా జరుగుతున్నాయి. తదుపరి షెడ్యూల్‌ను ఈ సెట్‌లోనే చిత్రీకరించనున్నట్టు చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

English Title
'syeraa narasimhareddy' shooting in 'rangasthalam' village set
Related News