మేరు దర్జీల మొర వినరా!

Updated By ManamTue, 03/13/2018 - 01:03
image

imageతెలంగాణ రాష్ట్రంలో పలు బీసీ కులాలవారు కులవృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించు కుంటున్నారు. కుమ్మరి, కమ్మరి, కంసాలి, మేదరి, వడ్రంగి, చాకలి, మంగలి, ఇలా ఎందరో తరత రాలుగా వస్తున్న కులవృత్తులతో జీవనం వెళ్లదీ స్తున్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో కార్పొరేట్ సంస్థలు కులవృత్తుల పనులను హస్తగతం చేసుకుం టుండడం వలన అనేక కులవృత్తులు కనుమరుగవు తున్నాయి. ఇదే కోవలో కుట్టు పనులు టైలరింగ్ వృత్తిగల దర్జీలు (మేరు)కులస్తులు చేసే స్త్రీ, పురుషుల, పిల్లల దుస్తుల కుట్టుపనులు కార్పోరేట్ సంస్థల రెడి మేడ్ దుస్తుల ఫ్యాక్టరీలు, ఫోరూంలు వెలవడంతో దర్జీలకు చేతినిండా పని లేకుండా పోయింది. పిల్లల నుంచి సీనియర్‌సిటిజన్ల వరకు చవకగా దొరికే రెడిమేడ్ దుస్తులపై మక్కువచూపుతున్నారు. దీంతో కుట్టుపనుల అవకాశాలు మృగ్యమవ్వడంతో అని వార్యంగా బతుకుతెరువు కోసం అదే రెడిమేడ్ ఫ్యాక్ట రీల్లో, రెడిమేడ్ వస్త్రాల దుకాణాల్లో రోజు కూలీలుగా మారుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు వలసబాట పడుతున్నారు. పట్టణాలకు నగరాలకు చేరుతున్నారు. పలువురు అరబ్ కంట్రీలకు వెళ్తూ కుటుంబాలకు సాయపడ్తూ జీవనం వెళ్ళదీస్తున్నారు.

ఇక ఎటూ పోలేక ఉన్న ఊరిలోనే ఉంటూ కుల వృత్తి చేసుకుంటున్న దర్జీమేరు కులస్తుల పాలిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల పథకాల కింద అన్ని వర్గాల వారికి టైలరింగ్ శిక్షణ ఉచితంగా ఇప్పించడం వంటి ఉపాధి శిక్షణా కార్యక్రమాలు శాపంగా మారాయి. దీంతో అన్ని వర్గాల వారు ఈ టైలరింగ్ వృత్తిలో ప్రవే శించి కుట్టు దుకాణాలు, ఇంటింటా కుట్టుమిషన్లు పెట్టుకొని కుట్టుపనులు చేసుకుంటుండడం వలని దర్జీ లకు దర్జాగా బతికే పరిస్థితులు కరువైపోతున్నాయి.

2004లో అప్పటి బీసీ కమిషన్ జనాభా ప్రాతి పదికన వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ పెంచి అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినా ఆచరించలేదు. మేరు (దర్జీ) వారిని వెనుకబడిన తరగతి బీసీ-డి గ్రూపులోనే ఉంచడంతో ఆర్థికంగా సామాజికంగా విద్యా ఉద్యోగాల పరంగా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నారు. వీరికి అవసరమైన నిధులు, ఆర్థిక సహాయాలు అందిం చడానికి మేరు సమాఖ్యను ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర బడ్జెట్ కేటాయింపులు చేసింది. దీంతో అవసరమైన ఆర్థిక సహాయం అందక వీరు ఇప్పటికి ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు.తెలంగాణ ఏర్పడితేనన్న తమ బతుకులు బాగుపడతాయేమోనన్న తలంపుతో తెలంగాణ ఉద్యమంలో మేరు దర్జీ కులస్తులు కుట్టుమిషన్లతో ఊరేగింపులు నిరాహార దీక్షలు, అన్ని రకాల ఉద్య మాల్లో పాల్గొన్నారు. 109 మంది మేరు కులస్తులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానం చేసి అమరులయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 19 ఆగస్టు 2014న నిర్వహించిన చారిత్రాత్మక ఇంటింటి సర్వేలో తమ ఆర్థిక ఇబ్బందులను, సమస్యలను మేరు కులస్తులు వివరించారు. తమవాస్తవ జీవన స్థితిగతులు, రిజర్వేషన్ అమలులో లోపాలు ప్రభుత్వం సరిదిద్దుతుందనే ఆశతో ఇటీవల బీసీ కమిషన్ చైర్మన్ బి.ఎన్.రాములుకు టీబీసీ ఐకాస ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. బలహీన వర్గాల మొహాలు వెలిగినప్పుడే, వారి కళ్ళలో ఆనం దం వెల్లివిరిసినప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నందుకు సార్థకత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశంలో సీఎం కేసీఆర్ గుండె లోతుల్లో నుంచి మాట్లాడిన మాటలే తెలంగాణలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు ఆశలు రేపుతున్నాయి.

తమకులాన్ని బీసీ-డీ గ్రూపులో నుంచి తొలగించి బీసీ-ఏ గ్రూప్‌లో చేర్చాలని మేరు కులస్తులకు చెందిన మేరు సమాఖ్య ద్వారా ప్రభుత్వం కుల జనాభా ప్రాతిపదికన ప్రతి ఆర్థిక సంవత్సరంలో సరిపడా బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వం నిర్వ హించే కుట్టుపనుల కాంట్రాక్టు పనులు, ఉద్యోగులకు, హాస్టల్ విద్యార్థులకు, యూనిఫాంలు, ఇతర కుట్టు పనులు, కార్పొరేట్, సంస్థలకు ఇవ్వకుండా కేవలం మేరు కులస్తులకే కాంట్రాక్టు అప్పగించాలని, వృద్ధులకు వితంతువులకు, పింఛన్లు, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, యువతీ యువకులకు స్వయం ఉపాధి రుణాలు, మంజూరు చేయాలని, ఇండ్లు లేని తెలుపురేషన్ కార్డుదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని, దర్జీలకు మేరు రాజకీయాల్లో రాణిం పునకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం కల్పించినప్పుడే వీరు దర్జాగా బతుకుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగ స్వాములవుతారు. 

 హరి అశోక్‌కుమార్
టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు

English Title
Tailors take to streets, seek help hand from govt
Related News