తలైవా సందడి షురూ..

Updated By ManamSat, 09/08/2018 - 00:06
Talaiva

imageరజనీకాంత్ తన 165వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. త్వరలోనే లఢఖ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్ నటించిన మరో విజువల్ వండర్ ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాష్ కరణ్ నిర్మిస్తున్నారు. నాలుగు వందల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘2.0’ను ఈ ఏడాది నవంబర్ 29న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా టీజర్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ విడుదల చేస్తున్నారు. ఇలాంటి చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉందంటూ కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. శుక్రవారం రోజు రజనీకాంత్ 165వ సినిమాకు ‘పేట్ట’ అనే టైటిల్‌ను ఖరారు 

English Title
Talaiva in busy shedule
Related News