'సైరా'.. క‌న్‌ఫ‌ర్మ్ చేసిన త‌మ‌న్నా

Updated By ManamMon, 04/16/2018 - 15:29
tammu

tammuమెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార‌, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి ఇతర ముఖ్య పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా న‌టించ‌బోతున్న‌ట్లు తాజాగా క‌థ‌నాలు వినిపించాయి. ఈ విష‌యంపై త‌మ‌న్నా స్పందించారు.

'సైరా'లో న‌టిస్తున్న మాట నిజ‌మేన‌ని.. త‌న అభిమాన న‌టులైన‌ చిరు, అమితాబ్‌తో క‌లిసి న‌టించ‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాన‌ని ఆమె పేర్కొంది. అంతేగాకుండా.. తన పాత్రకు సంబంధించిన‌ మ‌రిన్ని వివరాల్ని తెలుసుకునేందుకు ఇప్ప‌టికే రీసెర్చ్ కూడ మొదలుపెట్టానని.. ఆన్ లైన్ ద్వారా కొంత ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ సేకరించానని చెప్పుకొచ్చారట తమన్నా. త్వ‌ర‌లోనే త‌మ‌న్నా ఎంట్రీపై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నుంద‌ని తెలిసింది.

English Title
tamanna confirmed for 'sye raa'
Related News