తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Updated By ManamSat, 09/01/2018 - 09:07
Tamilnadu bus accident:eight killed
Tamilnadu bus accident:eight killed

చెన్నై : తమిళనాడులోని సేలం సమీపంలోని మామందూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు  ఢీకొన్న దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, మరో 30మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి .. సేలం నుంచి ధర్మపురికి ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ..... బెంగళూరు నుంచి సేలం వెళుతున్న బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కాగా క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మృతుల్లో నలుగురు కేరళ, ముగ్గురు కర్ణాటక, ఒకరు తమిళనాడుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

English Title
Tamilnadu bus accident:eight killed including 2 women in bus accident
Related News