కత్తి మహేశ్‌పై.. తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ!

Updated By ManamSun, 01/14/2018 - 18:32
tammareddy bharadwaja, Katti mahesh, Pawan fans

tammareddy bharadwaja, Katti mahesh, Pawan fansపవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు, సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌కు మధ్య వివాదం చెలరేగి దాదాపుగా నాలుగు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులకు, కత్తి మహేశ్‌కు మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టాలని సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు రావాలనే అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విజ్ఞప్తి చేశారు కూడా. కత్తి మహేశ్ వెనుక ఉండి తానే ఇదంతా చేయిస్తున్నట్టు వార్తలపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. కత్తి మహేశ్ వెనుక తాను ఉన్నానని కొందరు చేస్తున్న ఆరోపణలు అబద్ధమని కొట్టిపారేశారు. కత్తి మహేశ్ వెనుక వుండి ఇవన్నీ చేయించాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. అసలు, తనకు దీంతో ఎలాంటి సంబంధం లేని వ్యవహారమని స్పష్టం చేశారు. ఏదో కత్తి మహేశ్ తమ ఆఫీసులో కూర్చుంటూ ఉంటాడని, అంతమాత్రనా దీనికి కారణం తానని ఆరోపించడం సరికాదన్నారు. 

English Title
tammareddy bharadwaja gives clarity about allegations


Related News