ఆ ప్రముఖ నటుడు నన్ను తాకరాని చోట తాకాడు

Updated By ManamWed, 09/26/2018 - 13:13
Tanushree Dutta, Nana Patekar, Ganesh Acharya

Tanushree Dutta, Nana Patekar, Ganesh Acharyaబాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని నటి తనుశ్రీ దత్తా వెల్లడించింది. కొంతమంది తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన ఆమె., ఫైనల్‌గా వారి పేర్లను బహిర్గంతం చేసింది. 2009 సమంలో హార్న్ ఓకే ప్లీజ్ సినిమాలో ఓ పాటలో నటిస్తున్నప్పుడు నానా పటేకర్ నన్ను తాకరాని చోట తాకాడని పేర్కొంది.

‘‘నానా పటేకర్‌ గొప్ప నటుడు కావొచ్చు. కానీ అతడు ఆడవారి పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తిస్తాడు. అతను నటీమణులను కొడతాడు. లైంగికంగా వేధిస్తాడు. ఈ విషయాల గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు. కానీ ఎవ్వరూ మాట్లాడరు. కనీసం అతన్ని తమ సినిమాల్లోకి తీసుకోకుండా బ్యాన్‌ కూడా చేయరు. పెద్ద పెద్ద స్టార్‌ హీరోలందరూ ఇలాంటి నేరస్తులతో కలిసి పని చేస్తున్నప్పుడు ఎన్ని మీటూ ఉద్యమాలు వచ్చిన ఫలితం ఉండదు’’ అంటూ ఈ సందర్భంగా రజనీకాంత్, అక్షయ్ కుమార్ పేర్లను ప్రసావించింది. నానా పటేకర్‌తో పాటు నిర్మాత సామి సిద్ధిఖీ, దర్శకుడు రాకేశ్ సరాంగ్, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య కూడా తనను వేధించారని తెలిపింది.

ఇక ఇలాంటి విషయాల గురించి జనాలందరూ గుసగుసలాడతారని, కానీ ఒక్కరు కూడా ధైర్యంగా ప్రశ్నించరని అన్నారు. ఇంకా దారుణం ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి.. ‘ఆమె స్క్రీన్‌ మీద ఎంత స్కిన్‌ షో చేస్తుంది. బయట కూడా అలానే ఉంటుంది కాబట్టే ఇలా జరిగింది’ అని నిందలు వేస్తారు అంటూ తెలిపింది. 

English Title
Tanushree Dutta reveals Nana Patekar name in sexually harassed
Related News