భారత పర్యాటకులపై టాంజానియా దృష్టి

Updated By ManamSun, 09/23/2018 - 22:36
Tanzania

 Tanzania focus on Indian touristsముంబై: టాంజానియాకు వచ్చే భారతీయ పర్యాటకులల్లో 6-10 శాతం వృద్ధి ఉండొచ్చని ఆ దేశ టూరిజం శాఖ అంచనాలు వేస్తోంది. ఇందుకు నవంబర్ నుంచి  ఇరు దేశాల మధ్య నేరుగా విమానయాన సదుపాయం అందుబాటులోకి రానుండటమేనని టాంజానియా టూరింజం తెలిపింది. తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు 2017లో 69,000 మంది పర్యాటకులు వచ్చినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది. ‘‘గత 10-12 నెలల నుంచి ఇండియాలో చేస్తున్న ప్రచారం ద్వారా 6-10 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. అదే విధంగా నవంబర్ నుంచి ముంబై, దారుస్సలాంల మధ్య నేరుగా విమాన సదుపాయం అందుబాలులోకి రానుంది ’’ అని టాంజానియా టూరిస్ట్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ డెవోట ఎండచ్ అన్నారు. దశాబ్డ కాలంలో దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్యను రెండింతలకు చేరిందని ఆమె తెలిపారు. కాగా 2007లో ఏడు లక్షలుగా ఉన్న వార్షిక పర్యాటకుల సంఖ్య 2017లో 13 లక్షలకు చేరిందన్నారు. రానున్న 2020 నాటికి ఆ సంఖ్యను రెండు మిలయన్లకు పెంచుకోవడమే లక్ష్యమని ఆమె చెప్పారు. మొదట్లో ఇండియాలోని పెద్ద నగరాల నుంచి మాత్రమే టాంజానియా పర్యాటకులను ఆకర్షించేది. గత కొంత కాలంగా టైర్2,3 పట్టణాల్లో అది ప్రచారం ముమ్మరం చేసింది. ‘‘ ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో ఈ ఏడాది మేము రోడ్ షో నిర్వహించాం. వచ్చే ఏడాది మాత్రం టైర్2,3 నగరాలతో పాటు ఎక్కువ మొత్తం పట్టణాల్లో రోడ్ షో నిర్వహిస్తాం’’ అని ఆమె చెప్పారు. భారత్ ఇప్పుడు టాంజానియాకు ఐదో పెద్ద మార్కెట్‌గా ఉంది. రానున్న రెండెళ్లలో 2-3 స్థానాలకు ఈ ర్యాంకింగ్ ఉండనుంది. ముఖ్యంగా హనీమూన్, వ్యాపార సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు, బాలీవుడ్ నుంచి అధికంగా టూరిస్టులు టాంజానియాకు వెళ్తున్నారు.  అక్కడ ప్రధానంగా 16 జాతీయ పార్కులు, యునెస్కో గుర్తింపు పొందిన ఏడు ప్రపంచ వారసత్వ ప్రాంతాలు టాంజానియా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ.

English Title
Tanzania focus on Indian tourists
Related News