'టాక్సీవాలా' టీజ‌ర్ వాయిదా

Updated By ManamMon, 04/16/2018 - 17:48
taxiwala

twసంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మారిపోయారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఆ సినిమా త‌రువాత విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'టాక్సీవాలా'. ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమా ద్వారా రాహుల్‌ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు.  చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 17న ఈ సినిమా టీజ‌ర్‌ను విడుదల చేయబోతున్న‌ట్లు ఇదివ‌ర‌కు చిత్ర బృందం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. ఒక‌రోజు ఆల‌స్యంగా అంటే ఈ నెల 18న సాయంత్రం 6 గంట‌ల‌కు టీజ‌ర్‌ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా.. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మే 18న తెర‌పైకి రానుంది.

English Title
'taxiwala' teaser postponed
Related News