‘తెలంగాణలో టీడీపీ బలంగా ఉంది’

Updated By ManamTue, 09/04/2018 - 17:44
Nara Lokesh
Nara lokesh

విశాఖ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఇక పొత్తులపై పొలిటిబ్యూరో నిర్ణయం తీసుకుంటుందని నారా లోకేశ్ తెలిపారు.

‘ఫింటెక్ ఫెస్టివల్’ కు విశాఖ సరైన ప్రదేశం
రాష్ట్ర విభజన తర్వాత 99 శాతం ఐటీసంస్థలు అన్నీ హైదరాబాద్‌కే పరిమితం అయ్యాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం సాంకేతికంగా ముందంజలో ఉందన్నారు. ‘ఫింటెక్ ఫెస్టివల్’ కు విశాఖ సరైన ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ఇదో బృహత్తర వేదిక అని, వినూత్న ఆవిష్కరణలకు ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. అక్టోబర్ 22 నుంచి 26 వరకూ ఈ ఫింటెక్ ఫెస్టివల్ జరగనుందన్నారు.

సాంకేతికంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందంజలో ఉందని, సాంకేతికత సాయంతోనే అనేక ప్రభుత్వ శాఖల్లో పని సులభతరమైందని, ఫింటెక్ టెక్నాలజీ వినియోగంలో అంతా ప్రథమ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. ఐటీని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయట్లేదని, మూడు ప్రాంతాల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని లోకేశ్ అని అన్నారు.

English Title
TDP to contest all seats in Telangana, says Nara lokesh
Related News