తెలంగాణలో టీడీపీతో సీపీఐ పొత్తు ఖరారు

Updated By ManamSun, 09/09/2018 - 19:09
TDP-CPI alliance, finalized discussions, Assembly elections

TDP-CPI alliance, finalized discussions, Assembly electionsహైదరాబాద్: తెలంగాణలో టీడీపీ, సీపీఐ పొత్తు ఖరారైంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆదివారం టీడీపీతో సీపీఐ పొత్తుపై చర్చలు జరిగాయి. తెలంగాణ టీడీపీతో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని సీపీఐ నిర్ణయించింది. చర్చలు ముగిసిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మహాకూటమి కావాలనుకుంటున్నామని, కలిసి వచ్చే వారందరితో మాట్లాడతామని చెప్పారు. గెలిచే సీట్లు మాత్రమే అడుగుతామన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారమే తప్ప రైతు సమస్యలు ముఖ్యం కాదని చాడ విమర్శలు గుప్పించారు. 

మహాకూటమి జెండా ఎగురవేస్తాం: ఎల్ రమణ
సీపీఐతో చర్చల అనంతరం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి మిగతా పార్టీలతో మాట్లాడతామని, కాంగ్రెస్‌ పార్టీతోనూ మాట్లాడుతామని చెప్పారు. రానున్న రోజుల్లో మహాకూటమి జెండా ఎగురవేస్తామన్నారు. కేసీఆర్‌కు రాజకీయ, నైతిక విలువలు లేవని విమర్శించారు. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కలుపుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో టీడీపీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. 

English Title
TDP-CPI alliance finalized after discussions over Assembly elections
Related News