వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Rambabu

ప్రకాశం: ఏపీలో వైసీపీలోకి వలనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు టీడీపీ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అన్నా రాంబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

ఈ మేరకు శనివారం ఒంగోలుకు వచ్చిన ఆయన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ నెలాఖరులోగా తాను జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నానని ప్రకటించారు. అయితే గత ఎన్నికల అనంతరం నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న రాంబాబు ఇటీవలే  రాంబాబు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ, ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు