శివార్లపైనే టీడీపీ టార్గెట్!

Updated By ManamMon, 09/10/2018 - 13:37
TDP eyes to sweep city outskirts of hyderabad seats in Telangana assembly elections
  • సెక్యూలర్ ఓట్లు రాబట్టే యత్నం...

TDP eyes to sweep city outskirts of hyderabad seats in Telangana assembly elections

హైదరాబాద్ : గత ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టిన టీడీపీ ఈసారి కూడా ఎన్నికల్లోను సత్తా చాటాలనుకుంటోంది. తమ అభ్యర్థులపై ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ టీడీపీకి ఇప్పటికీ మంచి పట్టు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీలో పోటీ చేసి గెలిచిన వారు పార్టీ వీడి పోయినా కార్యకర్తల బలం తగ్గలేదని సమాచారం.

కాంగ్రెస్, టీడీపీతో పొత్తుకు ఇరు వర్గాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసినా నగర శివార్లలో మాత్రం తమ పార్టీకే మంచి మద్దతు ఉన్నదని టీడీపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నగర శివారుల్లో తమ పార్టీ అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని కోరనుంది.

గత ఎన్నికల్లో ఎల్‌బినగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రానగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలలో విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు పార్టీలు మారినా ఓట్లు మాత్రం ప్రజల్లో టీడీపీకే సానుకూల స్పందన ఉన్నట్టు సమాచారం. 

ఎక్కువ శాతం సెక్యూలర్ ఓట్లు ఉన్నందున తమ పార్టీ అభ్యర్థులనే నిలబెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో దేవేందర్‌గౌడ్‌కు గట్టి పట్టు ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శేరిలింగంపల్లిలోనూ బలమైన క్యాడర్ ఉందని ఇక్కడ గతంలో టీడీపీ అభ్యర్థి పోటీ చేసి విజయం సాధించడంతో తమ అభ్యర్థినే నిలబెట్టేందుకు సన్నద్దమవుతోంది.

ఉప్పల్‌లో గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించాడని, ఇక్కడ నుంచి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించ నున్నట్టు సమాచారం. కూకట్‌పల్లిలోనూ టీడీపీకి మంచి పట్టు ఉందని, తమ అభ్యర్థికే ఇక్కడి నుంచి టికెట్ కేటాయించేలని పార్టీ వర్గాలు కాంగ్రెస్‌ను కోరనున్నట్టు సమాచారం.

ఇబ్రహీంపట్నంలో గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఇప్పటికీ అక్కడ పార్టీ బలంగా ఉందని, తమ అభ్యర్థి తప్పనిసరిగా పోటీ చేస్తాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్‌లోనూ టీడీపీకి మంచి పట్టు ఉందని, ఇక్కడి నుంచి కూడా తమ అభ్యర్థికే టికెట్ ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గత ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తమ పార్టీ నుంచి గెలిచిన నేతలు వలస వెళ్లినా క్యాడర్ బలంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లోనూ తమకే అధికంగా సీట్లు వస్తాయని ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

English Title
TDP eyes to sweep city outskirts of hyderabad seats in Telangana assembly elections
Related News