కర్నూల్‌లో ఘోరం.. టీడీపీ కార్యకర్త దారుణ హత్య

Updated By ManamTue, 09/11/2018 - 10:41
Ramakrishna

Ramakrishnaకర్నూల్: జిల్లాలో ఘోరం జరిగింది. కృష్ణగిరి మండలం అలంకొండకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణను గుర్తు తెలియని దుండగులు బండరాయితో దారుణంగా హత్య చేశారు. దీంతో అతడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ హత్యను ఖండించిన టీడీపీ నేతలు, హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా పందిర్లపల్లిలో రామకృష్ణ రేషన్ డీలర్‌గా పనిచేస్తుండగా.. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కేసును నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు.

English Title
TDP leader murder in Kurnool
Related News