శివప్రసాద్, బంగి అనంతయ్య బాటలో...

Updated By ManamTue, 03/13/2018 - 18:50
PR Mohan
PR Mohan

తిరుపతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు నిత్యం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్, అనంతపురంకు చెందిన టీడీపీ నేత బంగి అనంతయ్య ఇప్పటికే వినూత్న రీతిలో తమ నిరసనలు తెలియజేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. తాజాగా మరో టీడీపీ నేత వినూత్న రీతిలో కేంద్రానికి తన నిరసన తెలిపారు. తిరుపతిలో టీడీపీ నేత పీఆర్ మోహన్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర క్రేన్ సాయంతో తలకిందులుగా వేలాడుతూ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PR Mohan

 

Tags
English Title
TDP Leader variety protest fo AP special status
Related News