పోలవరం వద్ద బీజేపీ వర్సెస్ టీడీపీ

Updated By ManamWed, 07/11/2018 - 17:47
tdp leaders vs bjp leaders at polavaram project

tdp leaders vs bjp leaders at polavaram project

పోలవరం: పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు ఢిల్లీ నుంచి వచ్చారు. దీంతో ఆయనకు ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విచ్చేశారు. అయితే ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా పోలవరంకు రావడం.. ఆయన వెంట కొందరు మంత్రులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా.. గడ్కరీ వచ్చే హెలిప్యాడ్ వద్దకు అనుమతించాలని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పంపుతామని పోలీసులు చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ప్రాజెక్టు వద్దే పార్టీ నేతలు, నిర్వాసితులతో గడ్కరీ సమావేశం అవుతారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గడవులోగా పోలవరాన్ని కేంద్రం నిర్మించి తీరుతుందన్నారు. కేంద్రం నిర్మిస్తున్న పోలవరంపై రాష్ట్రం పెత్తనం ఏంటి..? అని కన్నా వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు చెప్తున్నామని మాపై దాడులు చేస్తున్నారన్నారు. దీంతో టీడీపీ, బీజేపీ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం నెలకొంది. పోలవరంపై రాష్ట్రానికి కేంద్రం ఒక్కరూపాయి కూడా బాకీలేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి ఏం సంబంధం లేదని ఈ సందర్భంగా కన్నా స్పష్టం చేశారు. కేంద్రం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం సమన్వయకర్త మాత్రమేనన్నారు. కాగా తాజా వ్యవహారాలపై నేతలు, పార్టీ శ్రేణుల చర్చలో భాగంగా.. ఇటీవల జరిగిన దాడులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కన్నా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే విషయం విన్న తర్వాత కేంద్ర మంత్రి నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో వేచిచూడాల్సిందే.

English Title
tdp leaders vs bjp leaders at polavaram project
Related News