‘నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా’

Updated By ManamThu, 09/06/2018 - 17:27
bandaru satyanarayana murthy
bandaru satyanarayana murthy

అమరావతి : తన ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సవాల్ విసిరారు. ఆయన గురువారమిక్కడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ‘నేను నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా. నా ఆస్తులు ఎక్కడ పెరిగాయో చూపించాలి. విశాఖలో ల్యాండ్ ఫూలింగ్ ఆపాం. వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ లేదు.

పాదయాత్రకు ప్రజలు రాకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఆయన తండ్రి అవినీతిని మేము శుద్ధి చేస్తున్నాం. ఫార్మా సిటీ వల్ల కలుషితం అవుతుందని జగన్ అసత్యాలు చెబుతున్నాడు. చెరువులు, భూములు కబ్జా చేశానని నాపై ఆరోపణలు చేస్తున్నాడు. అధికార దాహం కోసమే ఆయన పాదయాత్ర చేస్తున్నాడు.’ అని ధ్వజమెత్తారు.

English Title
TDP MLA Bandaru Satyanarayana Challenge To Ys jagan mohan reddy
Related News