కేసుల మాఫీ కోసమే రాజీనామాలు

Updated By ManamTue, 02/13/2018 - 19:16
bonda uma

bonda umaవిజయవాడ, ఆంధ్రప్రదేశ్:ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి జగన్ రాజీనామాల ప్రస్తావన తీసుకువచ్చారని ఆరోపించారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. ఆయన గతంలోనూ ఇలాగే రాజీనామాల ప్రకటన చేశారని.. కానీ ఆ తర్వాత దాని గురించి మాట్లాడలేదని అన్నారు. ఆయన పాదయాత్రను జనం పట్టించుకోవడం లేదని అందుకే ప్రజల దృష్టిలో నిలిచేందుకు కొత్త నాటకాలు మొదలు పెట్టారని దుయ్యబట్టారు. మరోవైపు టీడీపీ ఎన్టీఏ నుంచి బయటకు వస్తే.. ఆ స్థానంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. గతేడాది ఇలాంటి ప్రకటనే చేసి కేసుల మాఫీ కోసం జగన్ ప్రయత్నించారని... అలాంటి వ్యక్తికి ప్రత్యేకహోదా గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కేంద్రం తీరును బట్టి తదుపరి కార్యాచరణ ఏంటనేది తమ అధినేత నిర్ణయిస్తారని వెల్లడించారు వెంకన్న.

English Title
tdp mla bonda uma comments on ys jagan
Related News