టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

Updated By ManamMon, 04/16/2018 - 09:01
Vijay Sai Reddy

Vijay Sai Reddy అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంతోమంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వారంతా తమ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిచూపుతున్నారని, వీరి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10వేల కోట్ల రూపాయాలతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 29సార్లు ఢిల్లీ వెళ్లినా చంద్రబాబుకు ప్రత్యేకహోదా గుర్తురాలేదని.. అలాంటిది ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

English Title
TDP MLAs in touch with us
Related News