'అమిత్ షా వ్యాఖ్యలు చాలా బాధాకరం'

Updated By ManamSat, 04/07/2018 - 15:42
TDP MP, Amith shah, Rediclus statements, TDP MPs, Ys Jagan mohan reddy

TDP MP, Amith shah, Rediclus statements, TDP MPs, Ys Jagan mohan reddy న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఎంపీలను జంతువులతో పోలుస్తూ అమిత్ షా కించపరచడం చాలా బాధాకరమని చెప్పారు. శనివారం ఢిల్లీలో వారు మీడియాతో మట్లాడుతూ.. అమిత్ షా వ్యాఖ్యలు తమకు చాలా బాధ కలిగించినట్టు తెలిపారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ నెలరోజులుగా తాము ఆందోళన చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం ఇస్తే ఎందుకు చర్చించలేకపోయారని స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ప్రశ్నించినట్టు టీడీపీ ఎంపీలు చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్‌ మాట్లాడుతున్నారని, బీజేపీతో లాలూచీ పడి వైసీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్‌కు లేదంటూ టీడీపీ ఎంపీలు విమర్శించారు.

English Title
TDP MPs denied Amith shah Rediclus statements
Related News