ఎన్డీయే, అన్నాడీఎంకే మ్యాచ్ ఫిక్సింగ్?

Updated By ManamWed, 03/21/2018 - 15:55
galla jayadev

gallaన్యూఢిల్లీ: టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే పార్టీలకు చెందిన ఎంపీలు లోక్‌సభను అడ్డుకుంటున్నారని టీడీపీ ఎంపీలు విమర్శించారు. పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరిగితే వారి సమస్యలు కూడా లేవనెత్తొచ్చు కదా అని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఇన్నిరోజుల నుంచి ఏపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ నుంచి స్పందనే లేదని మండిపడ్డారు. ఏపీ ప్రజలకు మోదీ ఇంత ద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదని టీడీపీ ఎంపీలు చెప్పుకొచ్చారు. అప్పుడు కాంగ్రెస్ అన్యాయం చేస్తే.. ఇప్పుడు బీజేపీ కూడా అదే వివక్ష చూపిస్తుందన్నారు. టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ఎంపీలతో మాట్లాడేందుకు మోదీకి ఏం ఇబ్బందని ఎంపీలు ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన నిధులు ప్రహరీ గోడ నిర్మించడానికి సరిపోయాయని టీడీపీ ఎంపీ ఒకరు ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకుండా కేంద్రం పారిపోతోందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. అందుకే చర్చ జరగనివ్వకుండా అడ్డుతగులుతున్నారని ఆయన ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకుండా కేంద్రంతో పాటు లోక్‌సభ స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని గల్లా జయదేవ్ విమర్శించారు. ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్ ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

English Title
tdp mps fire on trs, aidmk mps
Related News