
అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోదీని ఢీకొట్టే మొనగాడు చంద్రబాబేనని దేశం భావిస్తోందని చెప్పుకొచ్చారు. దళితులపై మోదీ, అమిత్ షాలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకహోదాతో పాటు దళితులపై దాడులను నిరసిస్తూ ఉద్యమించాలని వర్ల పిలుపునిచ్చారు. దళితులంతా సీఎం చంద్రబాబు వెనకే ఉంటారని వర్ల చెప్పారు.
అయితే ప్రధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని బీజేపీ నేతలు షెడ్యూల్ను కూడా సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు ఏపీకి కేంద్రం ఏమిచ్చింది..? రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ధి చేసింది? నిధుల లెక్కలు ఇలా అన్నీ చెప్పడానికి బీజేపీ నేతలు పక్కా ప్రణాళికలతోనే బీజేపీ నేతలు ఏపీ ప్రజల్లోకి వెళుతున్నారు.