నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించారు...

Updated By ManamWed, 08/22/2018 - 16:54
Teacher Paraded Naked For student Rape in Eluru
  • విద్యార్థిని గర్భవతిని చేసి, అబార్షన్ టాబ్లెట్స్ ఇచ్చిన టీచర్

Teacher Paraded Naked

ఏలూరు : పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయిస్తానంటూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడని ఆరోపిస్తూ ఓ ఉపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అతగాడి బట్టలు ఊడదీసి, నగ్నంగా వీధుల్లో ఊరేగించిన అనంతరం పోలీసులకు అప్పగించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరులోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌‌గా పనిచేస్తున్న రాంబాబు... పరీక్షల్లో ఎక్కువమార్కులు వేయిస్తానంటూ గత రెండేళ్లుగా ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 

ఇటీవలే ఆ విద్యార్థిని గర్భం దాల్చడంతో... రాంబాబు ఆమెకు అబార్షన్‌ అయ్యేందుకు టాబ్లెట్స్ ఇచ్చాడు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో ... కుటుంబీకులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయుడిని మాట్లాడదాం రమ్మంటూ... అతడికి దేహశుద్ధి చేశారు.

నడిరోడ్డుపై అతడిని నగ్నంగా ఊరేగించారు. ఈ తతంగాన్ని అంతా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. కాగా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చేసరికి రాంబాబు ఒంటిపై నూలుపోగు కూడా లేదు. దీంతో స్టేషన్‌లో అతడికి కప్పుకునేందుకు ఓ షర్టు, కట్టుకునేందుకు టవల్ ఇచ్చారు. అనంతరం రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

English Title
Teacher Paraded Naked For student Rape, He Gave Her Abortion Pill
Related News