‘అనగనగా ఓ ప్రేమకథ’ టీజర్ విడుదల

Updated By ManamMon, 09/24/2018 - 01:37
Anagana o prema katha

imageవిరాజ్ జె. అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్ వద్ద అసోసియేట్‌గా పనిచేసిన టి.ప్రతాప్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అలాగే ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె. అశ్విన్‌ను పరిచయం చేస్తున్నారు. హీరోయిన్లుగా రిద్ధికుమార్ మరియు రాధా బంగారు పరిచయమవుతున్నారు.

ప్రముఖ హీరో రాణా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను ఫేస్ బుక్ ద్వారా ఆదివారం విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌ను మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ నిర్మాత డి.వి.ఎస్.రాజు అల్లుడు కె.ఎల్.ఎన్.రాజు గత 30 సంవత్సరాలుగా సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్‌గా పేరుపొంది ఉన్నారు.

చాలా రోజుల తర్వాత నిర్మాతగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌ను స్థాపించి ఈ  ‘అనగనగా ఓ ప్రేమకథ’ అనే చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. 

English Title
Teaser release of 'Anagana o prema katha'
Related News