ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై తేజ స్పందన

Updated By ManamFri, 05/18/2018 - 10:30
teja, uday kiran

teja, uday సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో ఉదయకిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఈ చిత్రానికి ఉదయ్‌ కిరణ్ సినిమాలకు పరిచయం చేసిన తేజ దర్శకత్వం వహించనున్నట్లు, అందుకోసం ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నట్లు గాసిప్‌లు వినిపించాయి. ఇవన్నీ తేజ వరకు వెళ్లడంతో వాటిపై తాజాగా స్పందించారు ఆయన.

తాను ఎలాంటి బయోపిక్‌లు తెరకెక్కించడం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతులను ఎవరు సృష్టిస్తున్నారో తెలీదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా బాలకృష్ణ ప్రధానపాత్రలో ఎన్టీఆర్ బయోపిక్‌కు మొదట తేజ దర్శకుడిగా పనిచేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకున్నారు. దీంతో ఆ బయోపిక్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే.


 

English Title
Teja about Uday Kiran biopic
Related News