తెలంగాణ కే తలమానికం  ఎకో టూరిజం

Updated By ManamSat, 08/18/2018 - 22:04
eco tourism
  • సింగోటం, సోమశిలను అభివృద్ధి చేద్దాం

  • మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

imageహైదరాబాద్: పర్యాటకానికే పుట్టినిల్లు తెలంగాణ. వందల ఏళ్లుగా కాకతీయులు, రాజులు, మహ్మదీయులు, నైజాంలు ఇక్కడి ప్రాంతాన్ని ఏలడంతో నాడు ఈ గడ్డను పర్యాటక కేంద్రంగా..అందంగా మలిచారు. నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతూ...ఇక్కడి ప్రాంతాన్ని వనరుల్ని ప్రపంచానికి తెలియచేస్తుంది. తెలంగాణ సర్కార్ వచ్చాక పర్యాటకానికి పెద్ద పీట వేస్తోంది. ప్రత్యేక నిధులను కేటాయిస్తోంది. తెలంగాణ కు తలమానికంగా సింగోటం, సోమశిలను అభివృద్ధి చేయాలని...ఈ ప్రాంతంలోపర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

స్వదేశ్ దర్శన పథకంలో భాగంగా చేపడుతున్న సింగోటం, సోమశిల ఎకోటూరిజం సర్క్యూట్ పనులపై శనివారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. దాదాపు 20 కోట్లతో సోమశిలలో...మరో 8 కోట్లతో సింగోటంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని మంత్రి జూపల్లికి టూరిజం ఎండీ మనోహర్  వివరించారు. దాదాపు 90 శాతం పనులు పూర్తికావచ్చాయని...త్వరలోనే పనులన్నీ పూర్తిచేస్తామన్నారు. నిబంధనల మేరకు సకాలంలో పనులుచేయకపోతే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

కాటేజీలు, ల్యాండ్ స్స్కేపింగ్, బోటింగ్తో పాటు హరిత గెస్ట్ హౌస్, హోటళ ్లనిర్మాణ పనులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే సింగోటం చెరువును ట్యాంక్‌బండ్‌లా అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికలపై టూరిజం ఎండీ మనోహర్‌తో పాటు అహ్మదాబాద్‌కుచెందిన ప్రముఖ ఆర్కిటెక్టు నరేన్ గోయల్‌తోనూ మంత్రి చర్చించారు. వరదల అనంతరంతాను కేథారినాథ్ అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను మంత్రికి గోయల్ వివరించారు. విశాఖ, కాకినాడ బీచ్‌లో ప్లాన్‌ను కూడా తానే రూపొందించినట్లు ఆయన వివరించారు. అదే తరహాలో సోమశిల, సింగోటంలో అభివృద్ధి పరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి...తగు ప్రణాళికలు సిద్దం చేస్తానని జూపల్లి హామీ ఇచ్చారు.

English Title
Telangana advantage is eco tourism
Related News