తెలంగాణ శాసనసభ రద్దు

Updated By ManamThu, 09/06/2018 - 13:25
Telangana Assembly dissolved, kcr met governor
Telangana Assembly dissolved, kcr met governor

హైదరాబాద్ :  తొమ్మిది నెలల ముందుగానే  తెలంగాణ శాసనసభ రద్దు అయింది. అసెంబ్లీని రద్దుకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానం చేసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్లారు. శాసనసభ రద్దుపై మంత్రివర్గ సిఫార్సును కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు అందచేశారు. కాగా అసెంబ్లీ రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.

అంతకు ముందు ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. మంత్రివర్గ సమావేశానికి డిప్యూటీ సీఎంలు మహ్మద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావు, చందూలాల్, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

English Title
Telangana Assembly dissolved
Related News