మహాకూటమిలో టికెట్ల పోరు..

Updated By ManamSun, 09/23/2018 - 11:05
Mahakutami
telangana assembly elections-mahakutami-manam telugu news

హైదరాబాద్ : మహాకూటమిలో టికెట్ల పోరు సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు ధీటుగా ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐతో ఏర్పడిన మహాకూటమిలో సీట్ల కేటాయింపులో అగ్రనేతలు తర్జనాభర్జనా పడుతున్నారు. టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ఇప్పటికే టికెట్ల కోసం తమ అభ్యర్థులను మహాకూటమికి సిద్ధం చేసినప్పటికీ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల ప్రకటన కోసం కొన్ని రోజుల కింద నియోజవర్గానికి టికెట్ కోసం దరఖాస్తులను తీసుకుంది. దాదాపు వెయ్యికిపైగా దరఖాస్తులు కాంగ్రెస్‌కు అందడంతో అభ్యర్థుల విషయంలో కొత్త చిక్కు వచ్చిపడిందని అగ్రనేతలంటున్నారు. 

ప్రతి నియోజవర్గం నుంచి ముగ్గురు నుంచి నలుగురు పోటీకి దరఖాస్తు చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రతి నియోజవర్గంలో గతంలో గెలిచిన నాయకులను పోటీలో నిలిపేలా కాంగ్రెస్ జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి వెళ్తుండటంతో కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. టీడీపీ, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ నాయకులను కలుపుకుని నియోజవర్గంలో గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ప్రతి నియోజవర్గం నుంచి వచ్చిన ముగ్గురు వరకు దరఖాస్తు చేసుకుని, సీటు తమకే దక్కేలా ప్రతినియోజకవర్గంలోనూ ప్రచారం ఊపందుకుంది. తమకే సీటు రావాలని మాజీ నేతలు సీట్ల కోసం ప్రచారం చేస్తుంటే, ఈ సారైనా తమకు సీటు ఇవ్వాలని కొత్తగా టికెట్‌ను ఆశిస్తున్నవారు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. సమాచార మాద్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్‌లో తమ నాయకుడికే ఈ నియోజకవర్గం సీటు రావాలంటూ ప్రచారం చేస్తున్నారు. మహాకూటమిలో టికెట్ ఎవరికి దక్కుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

English Title
Telangana Assembly elections: Allies demand more seats from Congress
Related News