కుత్బుల్లాపూర్‌లో ఈసారి హోరాహోరేనా...?

Updated By ManamSun, 09/09/2018 - 15:25
telangana assembly elections: Reddy for the tough fight in Quthbullapur Constituency
  •  కుత్బుల్లాపూర్‌లో రాజుకుంటున్న ముందస్తు వేడి..!

  •  ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

  •  తెరాస నుండి తాజా మాజీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పేరును ప్రకటించిన కేసీఆర్  

  •  ఇంటింటికీ శ్రీశైలంగౌడ్ పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి మాజీ ఎమ్మెల్యే కూన  

  •  తెరాస రెబల్ బరిలో కొలన్ హన్మంత్‌రెడ్డి

  • టీడీపీ నుండి పోటికి సిద్దమవుతున్న బూర్గుబావి హన్మంత్‌రావు

  • బీజేపీ నుండి డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, చెరుకుపల్లి భరతసింహ్మరెడ్డి..

  • పోత్తుకు సై అంటున్నా వామపక్షాలు

telangana assembly elections: Reddy for the tough fight in Quthbullapur Constituencyకుత్బుల్లాపూర్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయవేడి వాడివేడిగా రాజుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేసే అశావాహులు అధిష్టానం చుట్ట్టూ చక్కర్లు కోడుతూ టికెట్ ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కా్రంగెస్, తెరాస రెబల్ అభ్యర్థి మధ్యనే గట్టి పోటీ ఉంటుందని రాజాకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిన 105 మంది తెరాస శాసనసభ అభ్యర్థుల జాబితాల్లో తాజా మాజీ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పేరును ఖారారు చేయడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతూ ఆయనకు ఆభినంధనలు తెలిపేందుకు క్యూ కట్టారు. 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తెరాస అభ్యర్థిగా వివేకానంద్ పేరును ప్రకటించడంతో ఇతర పార్టీల నుండి పోటీచేసే అభ్యర్థులకు  తమ పార్టీల నుండి టికెట్ దక్కుతుందో లేదోననే  టెన్షన్ అశావాహుల్లో మొదలైంది. గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంటి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని అతితక్కువ మెజార్టీతో ఓటమి చెందిన కొలను హన్మంత్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి పోటీచేసే అవకాశం దక్కకపోవడంతో నిరాశకు గురైన ఆయన ఇటీవల ఆయన వర్గీయులతో, అనుచరులతో సమావేశమై తెరాస నుండి రెబల్ అభ్యర్థిగా పోటీచేసేందుకు బరిలోకి దిగ డానికి సిద్దమైనట్లుగా ఆయన స్పష్టం చేశారు.

దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నుండి కె.పి.వివేకానంద్, టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థిగా కొలన్ హన్మంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి సిద్దమవడంతో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు చీలే అవకాశముందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కె.ఎం. ప్రతాప్ కుడా తెరాస రెబల్‌గా పోటీచేసేందుకు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తన క్యాడర్‌తో సమావేశాలు ఏర్పాటుచేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కా్రంగెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తలకు దిశానిర్ధేశం చేస్తూ పోటీకి సై అంటున్నాడు.గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బూర్గుబావి హన్మంత్‌రావు సిద్దమవుతున్నారు. 

ఇక బీజేపీ విషయానికి వస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, నియోజకవర్గం నాయకులు చెరుకుపల్లి భరతసింహ్మరెడ్డి సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసేందుకు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇక వామపక్ష నాయకులు పోటీకి సై అంటారా..లేక ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారా అనేది వేచి చూడాలి.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కా్రంగెస్, టీడీపీ పోత్తు పెట్టుకుని బరిలోకి దిగితే టీఆర్‌ఎస్‌కు కష్టంగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఏది ఏమైన్నప్పటికీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి ఎవరెవరూ ఎమ్మెల్యే అభ్యర్థలుగా పోటీచేయనున్నారో..పోటీచేస్తే ప్రధాన పోటీలో గెలిచేదెవరో వేచి చూడాలి

English Title
telangana assembly elections: Reddy for the tough fight in Quthbullapur Constituency
Related News