బాబూ మోహన్‌కు షాక్

Updated By ManamThu, 09/06/2018 - 15:28
Telangana CM KCR Given Big Shock to mla Babu Mohan
Telangana CM KCR Given Big Shock to mla Babu Mohan

హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ శాసనసభ్యుడు బాబూ మోహన్‌కు ఎన్నికల ముందే షాక్ తగిలింది.  బాబూ మోహన్‌కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దామోదర రాజనర్సింహపై దాదాపు నాలుగువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు మైనస్ మార్కులు పడటంతో పాటు, ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలతో పాటు, సమస్యలు పట్టించుకోవడంతో గట్టి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాగా గతంలో కేసీఆర్ నిర్వహించిన సర్వేలో బాబూ మోహన్‌కు పాస్ మార్కులు కూడా రాకపోవడంతో ఆయనను పిలిచి హెచ్చరించినా ఫలితం లేకపోయింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆంధోల్ నియోజకవర్గ అభ్యర్థిగా జర్నలిస్ట్  క్రాంతి కుమార్ పేరును కేసీఆర్ ప్రకటించారు. 

కాగా తెలంగాణ అసెంబ్లీ రద్దు అయిన రోజే కేసీఆర్...  105మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. అలాగే  చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లాల ఓదేలు కూడా చుక్కెదురు అయింది. ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించలేదు. 

English Title
Telangana CM KCR Given Big Shock to mla Babu Mohan
Related News