అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర

Updated By ManamThu, 09/06/2018 - 14:55
Telangana CM Meets Governor as Cabinet Dissolves State Assembly

telanganaహైదరాబాద్ : తెలంగాణ శాసనసభ రద్దు తీర్మానానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. అలాగే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా అప్పటివరకూ కేసీఆర్ కొనసాగాలని గవర్నర్ ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరినట్లు తెలుస్తోంది. కాగా అంతకు ముందు కేసీఆర్ ...శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న ఏకవాక్య తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందచేశారు.

కేసీఆర్ సుమారు అరగంటకు పైగా గవర్నర్‌తో సమావేశం అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి నేరుగా తెలంగాణ భవన్‌కు బయల్దేరి వెళ్లారు. మరోవైపు కేబినెట్ సమావేశం నిర్ణయాలను మధ్యాహ్నం 2:30 గంటలకు కేసీఆర్ మీడియాకు వెల్లడించనున్నారు. 

English Title
Telangana CM Meets Governor as Cabinet Dissolves State Assembly
Related News