నేటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సుయాత్ర

Updated By ManamSun, 04/15/2018 - 10:16
Telangana congress, bus yatra resume, Second phase bus yatra

Telangana congress, bus yatra resume, Second phase bus yatraహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర ఆదివారం నుంచి పున: ప్రారంభం కానుంది. ఈ నెల ఒకటిన ఆరంభమైన రెండో విడత బస్సుయాత్ర.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 (ఆదివారం) నుంచి 18వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు బస్సుయాత్రను నిర్వహించాలని (టీపీసీసీ) తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు డోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొంటారు. రాత్రికి ఖమ్మంలో బస చేస్తారు. 16న మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లందులో సభ నిర్వహించి రాత్రికి మణుగూరులో బస చేస్తారు. 17న మణుగూరులో బహిరంగ సభ నిర్వహించి, 18న భద్రాచలంలో ఆలయ దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు వెంకటాపురంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

English Title
Telangana congress bus yatra resume from today
Related News