విద్యార్థుల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు

Updated By ManamSun, 08/26/2018 - 02:48
kadiyam
  • హరిత పాఠశాల - హరిత తెలంగాణ ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం

kadiyamవరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో భాగంగా హరిత పాఠశాల - హరిత తెలంగాణ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇవాళ ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లా  సంగెం మండలం గవిచెర్ల మోడల్ స్కూల్లో కడియం శ్రీహరి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థినులకు బాలికా ఆరోగ్య రక్ష కిట్లను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థుల చేతుల్లోనే తెలంగా ణ భవిష్యత్ ఉందని కడియం స్పష్టం చేశారు. విద్యార్థుల్ని ఈ ప్రభుత్వం కడుపులో దాచుకుంటుందన్నారు. తల్లిదండ్రుల వలె సాకుతుందన్నారు. దీనిలో భాగంగానే నాణ్యమైన విద్య, పోషక విలువలు కలిగినభోజనం, ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత కిట్లను ప్రభుత్వం అందిస్తుందన్నారు. విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు  సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని కడుపునిండా పెడుతున్నామన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా రంగాన్ని పటిష్టం చేస్తున్నా మని కడియం తెలిపారు.  ఇప్పుడు బాలికా ఆరోగ్య రక్ష కిట్లు ఇస్తున్నారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5, 6వ తరగతి విద్యార్థినులకు కూడా ఆరోగ్య రక్ష కిట్లను అందజేస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. భావి తరాలకు మంచి భవిష్యత్ అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ హరితహారం ప్రారంభిం చారు. మంచి వర్షాలు పడలన్నా, పర్యావరణం బాగుండాలన్న, పంటలు పండాలన్నా పచ్చదనం ఉండా లి. కనీసం 33 శాతం అడవులు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఎక్కడ కూడా 33 శాతం అడవులు లేవు. అడవుల పెంపులో భాగంగా ఈ 5 ఏళ్లలో 230కోట్ల మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారు. ఇప్పటి వరకు 81కోట్ల మొక్కలు నాటారు. హరిత పాఠశాలలో నాటే మొక్క లను మీరు జాగ్రత్తగా పరిరక్షించాలి. ఒక్కో మొక్కను ఒకరు దత్తత తీసుకొని దానిని సంరక్షించాలి అని విద్యార్థులకు కడియం శ్రీహరి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత, మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English Title
Telangana future in student hands
Related News