కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సాయం

Updated By ManamThu, 04/26/2018 - 16:31
Telangana govt helping to karnataka Elections

Telangana govt helping to karnataka Elections

హైదరాబాద్: కర్ణాటక ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. 800మంది తెలంగాణ పోలీసులు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈ విషయమై సీఎస్ జోషి మీడియాతో మాట్లాడుతూ..  సరిహద్దు జిల్లాల్లోని చెక్‌పోస్ట్‌‌లు పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేసినట్లు జోషి తెలిపారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో కర్ణాటక పోలింగ్‌కు 48 గంటల ముందు వైన్‌షాపులు బంద్ చేస్తామని సీఎస్ తెలిపారు.

English Title
Telangana govt helping to karnataka Elections
Related News