తెలంగాణ కొత్త జోనల్‌కు కేంద్రం ఆమోదం

Updated By ManamThu, 08/30/2018 - 15:52
Telangana New zonal, Central govt, CM Kcr, President, PM Narendra modi, Multi zones
  • ఆమోదం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ 

  • గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోం శాఖ

  • రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు 

Telangana New zonal, Central govt, CM Kcr, President, PM Narendra modi, Multi zonesన్యూఢిల్లీ: తెలంగాణ కొత్త జోన్ల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రం తాజాగా గురువారం గెజిట్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం అనంతరం 7 జోన్లు, 2 మల్టీ జోన్లకు కేంద్ర హోంశాఖ గెజిట్‌ను విడుదల చేసింది. కేంద్రం తాజా ప్రకటన నేపథ్యంలో త్వరలోనే కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది. తెలంగాణ జోనల్‌ విధానానికి ఆమోదం నిమిత్తం సీఎం కేసీఆర్‌ ఇటీవల ఢిల్లీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఈ అంశంపై చర్చించారు. దాంతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు ప్రధాని మోదీ ఆమోద ముద్ర వేశారు. సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత ఇందుకు సంబంధించిన దస్త్రంపై మోదీ సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 

5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలోని ఉద్యోగాలన్నీ పూర్తిగా స్థానికులకే దక్కనున్నాయి. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదంతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానికతగా పరిగణిస్తారు. మరోవైపు కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కాగా, తెలంగాణలో కొత్త జోన్ల ఏర్పాటకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ ఆమోదం తెలపడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.  

తెలంగాణ కొత్త జోన్లు ఇవే.. 
తెలంగాణ జోన్లు: కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, చార్మినర్, యాదాద్రి, జోగులాంబ.
తెలంగాణ మల్టీ జోన్లు: యాదాద్రి, కాళేశ్వరం. 
కాళేశ్వరం జోన్: భూపాల పల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు
బాసర జోన్: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు
రాజన్న సిరిసిల్ల జోన్: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు
భద్రాద్రి జోన్: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్,వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు
యాదాద్రి జోన్: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, జనగామ జిల్లాలు
చార్మినార్ జోన్: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
జోగులాంబ గద్వాల జోన్: మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు

కాళేశ్వరం మల్టీ జోన్: బాసర, రాజన్న, కాళేశ్వరం, భద్రాద్రి. 
యాదాద్రి మల్టీ జోన్: జోగులాంబ, యాదాద్రి, చార్మినార్  

English Title
Telangana New zonal system granted by Central govt
Related News