పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు మార్గదర్శకాలు..

Updated By ManamFri, 08/31/2018 - 20:46
telangana panchayat secretary, notification download, 3rd septmber start application
  • తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ ప్రకటన

  • సెప్టెంబర్ 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ.. మొత్తం 9,355 ఖాళీలు

telangana panchayat secretary, notification download, 3rd septmber start applicationహైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ప్రకటన జారీ చేసిన పంచాయతీరాజ్‌శాఖ శుక్రవారం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం.. మొత్తం 9,355 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులకుగానూ మహిళలకు 3,158 పోస్టులను ఖరారు చేసింది. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, రిజర్వేషన్లు, పోస్టుల సంఖ్యను కూడా వెల్లడించింది. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శిల పరీక్ష విధానం, పూర్తి వివరాలను సైతం పంచాయతీరాజ్ శాఖ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది.

జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు.. సెప్టెంబర్ 3, 2018 నుంచి సెప్టెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు (31-08-2018) నాటికి 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. పరిమిత వయస్సు పైబడిన అభ్యర్థులు వారి రిజర్వేషన్ల బట్టి వయస్సు సడలింపు ఉంటుంది. పరీక్ష ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.800/- ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ (నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులతో పాటు పీహెచ్, ఎక్స్ సర్వీసు మెన్), రూ.400/- చెల్లించాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు (క్రిమిలేయర్ కింద) రూ.800/- చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్‌ను https://tspri.cgg.gov.in/ క్లిక్ చేయండి.  నోటీఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

English Title
telangana panchayat secretary notification download
Related News